కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 15 నుంచి20 వరకు చందనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం ఆలయ అధికారులు భక్తులకు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామికి పట్టువస్త్రాలు పంపించాలని నిర్ణయించింది.
శనివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి ఆలయ ఈవో రమాదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ పట్టు వస్త్రాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా కొండగట్టు ఆలయ అధికారులు అర్చకులు పట్టు వస్త్రాలను ఘనంగా స్వాగతించి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓ అంజన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
