ప్రజా తీర్పును వమ్ము చేయడమే.. డీలిమిటేషన్‌‌‌‌ బిల్లుపై సీజేపీ కామెంట్

ప్రజా తీర్పును వమ్ము చేయడమే.. డీలిమిటేషన్‌‌‌‌ బిల్లుపై సీజేపీ కామెంట్

న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌‌‌‌ బిల్లుకు మద్దతివ్వడమంటే ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) హెచ్చరించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అన్ని పార్టీలు, ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరింది. ఈమేరకు శనివారం ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, 50% సీట్ల పెంపు పేరుతో కేంద్రం బిల్లులు తెస్తోందని పేర్కొంది. 

మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఎన్నికల మ్యాప్‌‌‌‌ను మార్చి బీజేపీకి లబ్ది చేకూర్చాలని చూస్తోందని ఆరోపించింది. ఈ సందర్భంగా సీజేపీ నేతలు అశుతోష్‌‌‌‌ రాంకా, సౌరవ్‌‌‌‌ దాస్‌‌‌‌ మాట్లాడుతూ.. సీట్ల పెంపు ఆశతో కొన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. అస్సాం సరిహద్దుల వ్యవహారాన్ని పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు బీజేపీకి సహకరిస్తే యువత నష్టపోతారని హెచ్చరించారు. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌‌‌‌ ప్రక్రియపై నమ్మకం లేదన్నారు. లోక్‌‌‌‌సభలో 550 మంది ఉన్నా, 850 మంది ఎంపీలు ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదని సీజేపీ పాలసీ హెడ్‌‌‌‌ మెహర్‌‌‌‌ పస్రిచా అన్నారు.