ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కించిన చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది. శనివారం ‘ఉల్లిపూల’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు ఆమె చూసే ప్రపంచం కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఫీల్‌తో సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంది. సురేష్ బొబ్బిలి ప్రతి పాటను అందంగా కంపోజ్ చేశారు’ అని చెప్పాడు.
ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎక్సయిట్ చేస్తుందని నాగదుర్గ చెప్పింది. ఈ బిజీ లైఫ్‌లో మనం ఏ బంధాలను కోల్పోతున్నాం అని గుర్తుచేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు వంశీరెడ్డి చెప్పాడు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఇది సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమా అనుకుంటున్నారు. కానీ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ప్రియదర్శి, నాగ దుర్గ ఒకరితొ మరొకరు పోటీ పడి పెర్ఫార్మ్ చేశారు. యువ జంటలను ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. నటుడు అభినవ్ గోమటం, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ అభినయ శ్రీనివాస్, సింగర్ హీనా గ్రేస్ పాల్గొన్నారు.
