రియల్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా సీతన్నపేట గేట్: రాజ్ కుమార్ 

రియల్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా సీతన్నపేట గేట్: రాజ్ కుమార్ 

వేణుగోపాల్ హీరోగా, వై. రాజ్ కుమార్ దర్శకత్వంలో వైఎంఆర్ నిర్మించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. ఏడు భాషల్లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ ‘సినిమాలోని ప్రతి పాత్ర వైల్డ్‌‌గా, ఆసక్తికరంగా ఉంటుందని, థియేటర్స్‌‌లో ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. 

ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, మాస్ ప్రేక్షకులకు ‘సీతన్నపేట గేట్’ కచ్చితంగా నచ్చుతుందని హీరో వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. రియల్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా, ఊహించని ట్విస్టులతో తెరకెక్కించామని దర్శకుడు రాజ్ కుమార్ తెలిపారు.  తమ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత వైఎంఆర్ కోరారు. డీవోపీ యోగిరెడ్డి,  డైలాగ్ రైటర్‌‌‌‌ రవి, లిరిసిస్ట్‌‌ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.