ఆదిలాబాద్: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..పోక్సో కేసు నమోదు.. నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..పోక్సో కేసు నమోదు.. నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు షీ టీం దృష్టికి వెళ్లడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం..  ఈనెల 27న షీ టీం సభ్యులు పాఠశాలలో నిర్వహించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థినులు తమకు ఎదురైన ఇబ్బందులను షీ టీం సభ్యులకు తెలియజేశారు. 

దీంతో షీ టీం ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడు పొన్నారి మహేశ్వర్ పై పోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితున్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.