డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాకా.. ట్రైబల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సినీ రంగంలో శిక్షణ

డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాకా..  ట్రైబల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సినీ రంగంలో శిక్షణ

 

  • దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శిక్షణ

హైదరాబాద్, వెలుగు: ఎస్టీ గురుకులాలు, ఏకలవ్య మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వరకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 40 మంది విద్యార్థులకు ఏడు రోజుల పాటు సినీ రంగంలోని నిపుణులతో శిక్షణ ఇప్పించారు. 

శనివారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బంజారా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లోని క్రియేట్ విటీకి సరైన శిక్షణ ఇస్తే సంప్రదాయ చదువులకు అతీతంగా ఎన్నో రంగాల్లో రాణించగలరని అన్నారు. 

పాఠాలతోపాటు కళలు, క్రీడలు, ఇతర నైపుణ్యాల్లోనూ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, దాన్ని గుర్తించి తగిన శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధించగలరని చెప్పారు. గిరిజన, వెనుకబడిన వర్గాల యువతకు ఆధునిక సాంకేతిక, కళాత్మక రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలని సూచించారు.

సినీ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ..

బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంస్థ డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇచ్చారు. ఎస్టీ గురుకులాల నుంచి 35 మంది, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. 

వీరికి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, నటన, కథా రచన వంటి విభాగాల్లో ఏడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సినిమా నిర్మాణంలోని క్రియేట్ విటీ, టెక్నికల్​అంశాలను నేర్పించారు. దీంతో విద్యార్థులకు చిత్ర పరిశ్రమ పనితీరుపై అవగాహనతోపాటు తమ ఆసక్తిని వృత్తిగా మలుచుకునేందుకు ప్రాథమిక అనుభవం లభించింది.