ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో ఎఫెక్ట్‌‌‌‌: ప్రతికూల వాతారణం.. మత్స్యకారులఉపాధికి చర్యలు

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో ఎఫెక్ట్‌‌‌‌:  ప్రతికూల వాతారణం..  మత్స్యకారులఉపాధికి చర్యలు
  •    10 రోజుల్లో కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి వాకిటి ఆదేశాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

చెరువులు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలన్నారు. నీటి వనరుల్లో నీటి మట్టాలు తగ్గినా మత్స్యకారుల ఉపాధి, ఆదాయానికి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై 10 రోజుల్లోగా కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు.