మెట్ల బావుల్లో కళా ఉత్సవ్! దేశంలోనే తొలి స్టెప్ వెల్ ఆర్ట్ బినాలేకు హైదరాబాద్ వేదిక

మెట్ల బావుల్లో కళా ఉత్సవ్! దేశంలోనే తొలి స్టెప్ వెల్ ఆర్ట్  బినాలేకు హైదరాబాద్ వేదిక

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే మొట్టమొదటి మెట్ల బావి ఆధారిత ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం(బీఏఎస్) 2026’కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు 40 రోజుల పాటు ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. శనివారం హైటెక్ సిటీలోని ఏక్‌‌చిత్రలో  జరిగిన కార్యaక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి, బావోలి ఆర్ట్ సంగం ఫౌండర్లు కల్పనా రమేష్, అన్నపూర్ణ ఈ వేడుక వివరాలను వెల్లడించారు. 

చారిత్రక మెట్ల బావులు, వారసత్వ కట్టడాలకు సమకాలీన కళలతో కొత్త జీవం పోయడం, నీటి సంరక్షణ, కళ, వాస్తుశిల్పంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ బినాలేను రూపొందించారు. ఇందులో దేశవిదేశాలకు చెందిన 200 మందికి పైగా సమకాలీన కళాకారులు పాల్గొననున్నారు. 50కి పైగా విభిన్న కార్యక్రమాలు, దాదాపు 50 లైవ్ షోలు ఉంటాయి.