నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. నా కెరీర్‌లో కోరుకున్న లార్జ్ స్కేల్ మూవీ. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విజువల్ వండర్‌ను చూపిస్తాం.
ఇండియన్ సినిమా గర్వపడేలా చేస్తాం. ఇందులో నేను చేసిన అర్జున్ పాత్ర మానసికంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని చెప్పాడు. దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘అందరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది. తొలి పది నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, తన కెరీర్‌లో దక్ష పాత్ర ప్రత్యేకమైనదని హీరోయిన్ మీనాక్షి చౌదరి చెప్పింది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
