విశ్వక్ సేన్ లెగసీ మూవీ షూట్ కంప్లీట్‌‌ 

విశ్వక్ సేన్ లెగసీ మూవీ షూట్ కంప్లీట్‌‌ 

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, కేకే మీనన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం  షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌‌కు ప్లాన్‌‌ చేస్తున్నారు.  తండ్రి రాజకీయ వారసత్వం వల్ల ఊహించని పరిస్థితులను ఎదుర్కొనే ఓ యువకుడి జీవితం.. అధికార పోరు, కుటుంబ బంధాలు, ద్రోహం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. రావు రమేష్, మురళీ మోహన్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.  కళాహి మీడియా బ్యానర్‌‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు.