దేశభక్తి నేపథ్యంలో ‘మిసెస్ కల్నల్’.. ఆకట్టుకుంటున్న టీజర్

దేశభక్తి నేపథ్యంలో ‘మిసెస్ కల్నల్’.. ఆకట్టుకుంటున్న టీజర్

ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ జంటగా శ్రీకరం ప్రభాకర్ దర్శకత్వంలో  సాయి కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘మిసెస్ కల్నల్’. మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  హీరో చిరాగ్ జానీ మాట్లాడుతూ ‘దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు. 

ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందని  హీరోయిన్   ప్రియా హెగ్డే చెప్పింది.  ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని, ఇందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ అన్నాడు. టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత సాయికృష్ణ అన్నారు.  నటులు మహేష్ విట్టా, మాన్య గౌడ, ఎడిటర్ కార్తికేయన్ పాల్గొన్నారు.