బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జంటగా కనిపించారు. షారుఖ్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం షారుఖ్, కరీనా జంట కలిసి డాన్స్ చేశారు. శనివారం ఈ చిత్రం నుంచి ‘డాడీ కూల్’ (కింగ్ వెర్షన్) అనే పాటను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన ‘డాడీ కూల్’ స్పూర్తితో సచిన్-జిగర్ ఈ పాటకు సరికొత్త రెట్రో బీట్స్ అందించారు. అరిజిత్ సింగ్, శిల్పారావు పాడి న ఈ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేయగా, షారుఖ్-కరీనా తమ ఐకానిక్ కెమిస్ట్రీ, స్టైలిష్ స్టెప్పులతో షేక్ చేశారు. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.
