అమరావతి: ఏపీలోని 27 జిల్లాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం (నవంబర్ 29) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. 3,803 సర్పంచ్ స్థానాలకు 10,295 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరో 29,603 వార్డు సభ్యుల స్థానాలకు 63,395 మంది బరిలో ఉన్నారు. ఈ విడతలో మొత్తం 83,52,338 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు.
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా వేంపల్లిలో తమను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం లేదంటూ వైసీపీ ఏజెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ పేర్కొంది.
