మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసిన మొహబ్బత్ టీమ్.. ఆకట్టుకుంటున్న వరమే లిరికల్ సాంగ్

మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసిన మొహబ్బత్ టీమ్.. ఆకట్టుకుంటున్న వరమే లిరికల్ సాంగ్

సంతోష్‌‌ రాజా,  శ్రేయాస్‌‌ సేన్‌‌ జంటగా  మ్యాక్‌‌ దర్శకత్వంలో అఫ్రోజ్‌‌ షేక్‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘మొహబ్బత్‌‌’. షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘వరమే’ అంటూ సాగే పాటను దర్శకుడు వీఐ ఆనంద్ విడుదల చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన  ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ రాయగా, కృష్ణ తేజస్వి పాడిన తీరు ఆకట్టుకుంది. ఈ  లిరికల్ వీడియోలోని విజువల్స్, సింపుల్ కొరియోగ్రఫీ పాటకు మరింత ఆకర్షణగా నిలిచాయి.   

ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ లవ్‌‌ సాంగ్‌‌ను రూపొందించారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌‌లో భాగంగా విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తుందని టీమ్ చెబుతోంది. ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ    కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కలాం రచయితగా, శ్రీ వర ప్రసాద్ ఎడిటర్‌‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.