పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇండి కూటమి డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకొమ్మని కోరేందుకు ఆదివారం ( నవంబర్ 29 ) ఇండి కూటమి అగ్రనేతలతో కలిసి డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి చేరుకున్నారు సోనియా గాంధీ. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. డీలిమిటేషన్ అంశంపై రేవంత్ గట్టి వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది.
డీలిమిటేషన్ పై డీఎంకే నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని స్టాలిన్ సూచించినట్లు తెలుస్తోంది. సుమారు గంట 15 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా, మమతా బెనర్జీ, ఇతర ఇండి కూటమి నేతలు డీలిమిటేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
A;LSO READ : డీలిమిటేషన్‌పై నిర్ణయం వెనక్కి తీసుకోండి.. పవార్, స్టాలిన్‌కు ఉద్ధవ్ థాకరే రిక్వెస్ట్
ఒకే విధంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు సుమారు 142 సీట్లు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 66 సీట్లు మాత్రమే పెరుగుతాయని, దీనివల్ల ఉత్తరప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య అంతరం మరింత పెరుగుతుందని మొదటి నుంచి అభిప్రాయపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
