స్వాతంత్ర్యమే రాకుంటే పాక్ సైన్యం బూట్ల కిందే ఉండేవాళ్లం: షేక్ హసీనా సంచలన కామెంట్స్ 

స్వాతంత్ర్యమే రాకుంటే పాక్ సైన్యం బూట్ల కిందే ఉండేవాళ్లం: షేక్ హసీనా సంచలన కామెంట్స్ 

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంప ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్ కు  స్వాతంత్ర్యం సాధించడం వెనక ఎంతో సమరయోధులు త్యాగాలు ఉన్నాయి. వారు పోరాటం చేయకపోయి ఉంటే బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చేది కాదు.. ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యం బూట్ల దెబ్బలకు బంగ్లాదేశీయులు గురయ్యేవారని అన్నారు.  ఫ్రీడమ్ ఫైటర్లను గౌరవించాలని , దేశ విముక్తికోసం వారు చేసిన  త్యాగాలను  గుర్తంచుకోవాలని అన్నారు. 

బంగ్లాదేశ్ అవామీ లీగ్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో జూమ్ ద్వారా ఆడియో ప్రసంగం చేసిన హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వచ్చిన ఆమె ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంటున్నారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని గతంలో ప్రకటించిన క్రమంలో ఆమె కామెంట్స్ ప్రాధాన్యతను  సంతరించుకున్నాయి. తనను ఇంతకాలం దేవుడు బతికించాడంటే దేశానికి మంచి చేయడానికేనంటూ   కామెంట్ చేశారు షేక్ హసీనా.

 ఫ్రీడమ్ ఫైటర్లను ఒక్కొక్కరిగా లక్ష్యంగా  చేసుకున్నారని హసీనా ఆరోపించారు.  విముక్తి చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు షేక్ ముజిబుర్ రెహమాన్ సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన దేశ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేశారని, స్వతంత్ర్య భూభాగాన్ని జాతీయ గుర్తింపును అందించారని అన్నారు. 

ALSO READ : అమెరికా సైన్యంపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్‌ని వాడుకుందా ? ఎలాన్ మస్క్ కంపెనీకి కొత్త చిక్కులు!

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నిత్యావసర వస్తువులు, విద్యుత్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజల జీవితాల్లో సంతోషం తగ్గిపోయిందని విమర్శించారు. ప్రజలంతా ఐక్యంగా సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.