మాజీ సీఎం స్టాలిన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత... ఇండి కూటమికి వ్యతిరేకంగా డీఎంకే యూత్ వింగ్ నిరసన..

మాజీ సీఎం స్టాలిన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత... ఇండి కూటమికి వ్యతిరేకంగా డీఎంకే యూత్ వింగ్ నిరసన..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజెర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టనున్న క్రమంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్డీయేతర పక్షాలైన డీఎంకే, వైసీపీ వంటి పార్టీలు కూడా మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇండి కూటమి మాత్రం డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే అధినేత స్టాలిన్ తో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలతో కలిసి తమిళనాడు చేరుకున్నారు సోనియా గాంధీ. ఈ క్రమంలో ఇండి కూటమి నేతలకు వ్యతిరేకంగా డీఎంకే యూత్ వింగ్ నిరసనకు దిగడంతో స్టాలిన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇండి కూటమి నేతలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది డీఎంకే యూత్ వింగ్. ఇండి కూటమి నేతలు గో బ్యాక్‌ అంటూ నినాదాలు. డీఎంకేతో చర్చించేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదంటూ నిరసన చేపట్టారు డీఎంకే నేతలు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : డీలిమిటేషన్‎పై రాజీపడే ప్రసక్తే లేదు: ఇండియా కూటమికి తేల్చిచెప్పిన స్టాలిన్

డీఎంకే, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా కూటమిలోని ఇతర పార్టీల వైఖరితో విభేదించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ దేశ ఎన్నికల మ్యాప్‌ ను మారుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలే సరిపోతాయని.. బీజేపీ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ.