Netflix Thriller: జైల్లో ఉంటూనే రూ.200 కోట్ల స్కామ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి సంచలన ట్రూ క్రైమ్ స్టోరీ!

Netflix Thriller: జైల్లో ఉంటూనే రూ.200 కోట్ల స్కామ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి సంచలన ట్రూ క్రైమ్ స్టోరీ!

ఓటీటీ ప్రేక్షకులకు మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ట్రీట్ సిద్ధమవుతోంది. నిజ జీవితంలో జరిగిన సంచలన మోసం.. రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు.. జైలు గోడల మధ్య నుంచే సాగినట్లు వెలుగులోకి వచ్చిన కార్యకలాపాలు.. బాలీవుడ్‌తో లింకులు.. ఇలా సినిమా కథను తలపించే ఎన్నో ఆసక్తికర అంశాలతో ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకేశ్ చంద్రశేఖర్ కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మరి ఈ డాక్యుమెంటరీ పేరు ఏంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఇందులో ఎలాంటి విషయాలను చూపించబోతున్నారు? అనేది చుద్దాం.. 

డాక్యుమెంటరీ పేరు ఇదే..

‘లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. సుకేశ్ రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు, అతని మోసాలు, బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, జైలు నుంచే సాగించినట్లు చెబుతున్న కార్యకలాపాలపై ఇందులో చూపించనున్నారు.

ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇండియా టుడే ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

రెండేళ్ల రీసెర్చ్.. జైలు నుంచే స్కామ్ ఎలా?

సుకేశ్ తీహార్ జైలులో ఉన్నప్పటికీ అతని కార్యకలాపాలు ఎలా కొనసాగాయనే అంశంపై ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా ఫోకస్ చేయనుంది. తప్పుడు గుర్తింపులు, భారీ హామీలతో కోట్లాది రూపాయల మోసాలకు ఎలా పాల్పడ్డాడు? వ్యవస్థలోని లోపాలను ఎలా ఉపయోగించుకున్నాడు? అనే విషయాలను రెండేళ్లకు పైగా చేసిన పరిశోధనతో చూపించనున్నారు.

బాలీవుడ్ కనెక్షన్లు కూడా హైలైట్..

సుకేశ్ పేరు వినగానే గుర్తొచ్చేది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వ్యవహారం. ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన జీవితం, సినీ ప్రముఖులతో పరిచయాలు వంటి అంశాలతో పాటు అతని బాలీవుడ్ కనెక్షన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించనున్నారు.

ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలతో గుర్తింపు పొందిన టీమ్..

గతంలో ‘కరీ & సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్’, ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ’ వంటి డాక్యుమెంటరీలను రూపొందించిన టీమ్‌నే ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించగా.. కరణ్ రాణా కో-డైరెక్టర్‌గా పనిచేశారు.

నెట్‌ఫ్లిక్స్‌కు సుకేశ్ లీగల్ నోటీసులు..

డాక్యుమెంటరీ విడుదలకు ముందే సుకేశ్ చంద్రశేఖర్ వివాదానికి తెరలేపాడు. తన కథతో రూపొందించిన డాక్యుమెంటరీని వాయిదా వేయాలంటూ నెట్‌ఫ్లిక్స్, ఇండియా టుడే గ్రూప్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. తనపై ఉన్న కేసుల విచారణపై డాక్యుమెంటరీ ప్రభావం చూపుతుందని అతని తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఈ డాక్యుమెంటరీ విడుదలపై మరింత ఆసక్తి నెలకొంది.

ALSO READ : Salman Khan: వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ రూ.కోటి వాచ్ గిఫ్ట్.. 'మాన్‌స్టర్' సెట్స్‌లో సర్‌ప్రైజ్!

డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుందా?

రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు, జైలు నుంచే సాగిన కార్యకలాపాలు, బాలీవుడ్ కనెక్షన్లు, ఎన్నో సంచలన మలుపులతో ‘లవ్ స్కామ్ ఔర్ ధోఖా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నిజ జీవిత క్రైమ్ కథలను ఇష్టపడేవారికి ఈ డాక్యుమెంటరీ మంచి ట్రీట్ కానుంది.