అమరావతి: సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (నవంబర్ 29) తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య విషమించడంతో ఇవాళ మరణించారు. రాయపాటి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
