నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జలజీవన్ ప్రాజెక్టు దగ్గర తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. 2026 నవంబర్ 29 (ఆదివారం) ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగి, ఘర్షణకు దారితీసింది.
ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి రాళ్ల దాడికి దారితీసింది. నాగార్జునసాగర్ కొత్త వంతెన దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన జరగటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్ దగ్గర చెక్ చేసి ఆంధ్రప్రదేశ్ వాహనాలను మాత్రమే పంపిస్తున్నారు తెలంగాణ పోలీసులు.
