జ్యోతిష్యం: ఒకేరాశిలో శుక్రుడు,వరుణుడు నవపంచమ రాజయోగం.. మూడురాశుల వారికి అద్భుత యోగం..!

జ్యోతిష్యం: ఒకేరాశిలో శుక్రుడు,వరుణుడు నవపంచమ రాజయోగం..  మూడురాశుల వారికి అద్భుత యోగం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో జనాల వ్యక్తిగత జీవితంపై  ప్రభావం పడుతుంది. గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి.  2026 నవంబర్​ 30న శుక్రుడు.. చంద్రుని ఉపగ్రహమైన వరుణుడు ఒకే రాశిలో సంచారంవలన  నవ పంచమ రాజ యోగంఏర్పడనుంది.  దీంతో కొన్ని రాశుల్లో మార్పులు తెచ్చింది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.  దీని వలన  మూడు  రాశుల వారు అదృష్టవంతులు కానున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల ( వృషభం, తుల, మీనం) గురించి తెలుసుకుందాం. . .!

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలకు కారకుడు. శుక్రుడు త్వరలో నవ పంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. నవంబర్ 30న ఉదయం 10.32 గంటలకు  ఈ యోగం ఏర్పడబోతుంది.
కొన్ని రాశుల వారికి  ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగుతారు.  ఈ యోగం మూడు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. కొంతమందికి శుభవార్తలు అందుతాయి. పనిలో ఉన్నత అధికారులు మీ పనితీరును అభినందిస్తారు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు.  వైవాహిక జీవితంలో ఆనందం సాగుతుంది. మీరు ప్రణాళిక వేసుకున్న దాని ప్రకారం పనులను పూర్తి చేస్తారు.పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి: ఈ రాశివారికి నవ పంచమ రాజయోగం వలన గతంలో చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో  రుణ బాధలు తీరి ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుటుంది. కొత్త ఆదాయ  మార్గాల ద్వారా ఆదాయం చేతి కందుతుంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ రావడం.. వేతనం పెరుగుతుంది.  ఆదాయం ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
 విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు  గుడ్​ న్యూస్​ వింటారు.  ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

తులా రాశి: నవ పంచమ రాజయోగం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా  ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతుంది.  శత్రువులు కూడా మిత్రులుగా మారతారడంతో ...  పట్టిందల్లా బంగారమే కానుంది.  విదేశీ ప్రయాణాలు చేయాలి అని కలలు కనే వారి కోరిక తీరనుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఆర్దిక ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.