వారఫలాలు( నవంబర్ 29– - డిసెంబర్ 5): ఈ వారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ఆదాయం, ఆరోగ్యం, వృత్తి, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!
మేషరాశి : ఈ రాశి వారికి ఈవారం గ్రహాల బలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభరాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.పనిలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.వ్యాపారంలో కొత్త డీల్ కుదురుతుంది. అయితే మీ ప్రణాళికలు పూర్తయ్యే వరకు బయట చెప్పకండి.పెండింగులో ఉన్న బకాయిలన్నీ లభిస్తాయి. స్నేహితులు, ప్రియమైన వారితో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .ప్రేమ జీవితం సంతోషకర వాతావరణంలో కొనసాగుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గే అవకాశం కూడా ఉంది.ఉద్యోగంలో పని ఒత్తిడి, చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది.డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కోపం.. ఆవేశం తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కేరీర్ విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి పరంగా.. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి. ఆరోగ్య వి షయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం కీలక నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. దానధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు .. సొంత ఇంటి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం పనిలో పురోగతి, కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి.మీ పని కార్యాలయంలో ప్రశంసలు పొందుతుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభించే సూచనలు ఉన్నాయి..కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమమవుతాయి. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం పని పరంగా ముఖ్యమైనది.పెండింగ్ పనుల పూర్తి, సహోద్యోగుల సహకారం లభిస్తుంది.సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. పెద్దమొత్తాల్లో లాభాలను అందిస్తాయి. జాయింట్ వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాతో కూడిన భాద్యతలు వరిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ లు అందుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తులారాశి: ఈ రాశి వారికి ఈవారం మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.ఉద్యోగంలో స్థిరత్వం, పెండింగ్ పనులు పూర్తవుతాయి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగాఉంటుంది. పాత బాకీలు చేతికి అందుతాయి.నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి సమయమని చెప్పవచ్చు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.
పెళ్లిప్రయత్నాలు.. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు,
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారం - పెండింగ్ పనులు వేగవంతమవుతాయి.ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీ - మాటకు విలువ పెరుగుతుంది, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.ముఖ్యంగా డబ్బు రాబడి పెరుగుతుంది. . కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారవేత్తలకు ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
ధనుస్సురాశి : ఈ రాశి వారికి ఈ వారం - ఉత్సాహంగా కొనసాగుతుంది..ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, .వ్యాపారంలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి.
మకరరాశి: ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పనిని ప్లాన్ ప్రకారం చేయాలి, ఓర్పు, సహనం చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. కొత్త బాధ్యతలు వస్తాయి.వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో కొత్త పెట్టుబడులు పెట్టవద్దు.బంధువులు.. స్నేహితుల వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోని ఆర్డర్లు వస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి, అనుకోని ఖర్చులు రావడం.. బాధ్యతలు పెరగడం వంటి పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.
కుంభరాశి : ఈ రాశి వారికి ఈ వారం - అనవసర ఖర్చులు పెరుగుతాయి.కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరమని పండితులు చెబుతున్నారు. ఇతరులతో సమయస్ఫూర్తిగా మెలగాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తంగా ఉండండి. ప్రేమ.. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి సాగిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. పెద్దల సలహాను ఆచరించేటప్పుడు అవి మీకు ఎంత వరకు ఉపయోగపడాతాయో చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలతో కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. పని ఒత్తిడి, శత్రువుల నుంచి ఇబ్బందులు వచ్చినా.. చివరకు మీరే విజయం సాధిస్తారు. వ్యాపారంలో మొదట్లో ఇబ్బందులు, తర్వాత మెరుగుదల ఉంటుంది.కుటుంబంలో పాత వివాదాలు పరిష్కారమవుతాయి. . ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ఉన్నతాధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
