శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌ది వెన్నుపోటు చరిత్ర.. ఎన్సీపీ (ఎస్పీ)పై కాంగ్రెస్ 

శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌ది వెన్నుపోటు చరిత్ర.. ఎన్సీపీ (ఎస్పీ)పై కాంగ్రెస్ 

ముంబై/న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌‌‌‌ బిల్లుకు ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్‌‌‌‌ ఫైర్​అయ్యింది. శరద్‌‌‌‌ పవార్‎ది వెన్నుపోటు పొడిచే చరిత్రని విమర్శించింది. అధికారం లేకపోతే పవార్‌‌‌‌ పరిస్థితి నీళ్లలో నుంచి ఒడ్డున పడ్డ చేప లెక్క అవుతుందని కాంగ్రెస్ నేత విజయ్‌‌‌‌ వడెట్టివార్‌‌‌‌ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిన వారి చరిత్ర రాస్తే అందులో పవార్‌‌‌‌ పేరు కచ్చితంగా ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పవార్‌‌‌‌ను గెలిపించేందుకు తమ సొంత సీటును త్యాగం చేశామని, ఇప్పుడు ఆయనే బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏంటని ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.