గోవా వేదికగా తొమ్మిది రోజుల పాటు సినీ ప్రియులను అలరించిన 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు( IFFI ) అట్టహాసంగా ముగిశాయి. ప్రపంచ సినిమాకు భారతీయ సంస్కృతిని జోడిస్తూ సాగిన ఈ మెగా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చివరి రోజు అవార్డుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కార్పెట్ సందడి, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖుల సందడి మధ్య విజేతలకు పురస్కారాలు అందజేశారు.
ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి...
ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు ఫ్రెంచ్-పోర్చుగీస్ నిర్మాణ చిత్రం 'అక్వి'ని వరించింది. దర్శకుడు టియాగో గీడ్స్ తెరకెక్కించిన ఈ చిత్రం 15 పోటీ చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 'కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1'లో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు విభాగంలో సిల్వర్ పీకాక్‌తో పాటు ప్రత్యేక ప్రస్తావన కూడా లభించింది.
ప్రతిభకు పట్టాభిషేకం..
ఉత్తమ దర్శకుడిగా జర్మనీకి చెందిన దిగ్గజ దర్శకుడు వోల్కర్ ష్లాండోర్ఫ్ 'విసిటేషన్' చిత్రానికి సిల్వర్ పీకాక్ అందుకున్నారు. 'ది మెల్ట్‌డౌన్'లో నటనకు మాయా ఓరూర్క్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. అర్జెంటీనా చిత్రం 'ది రివర్ ట్రైన్' ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. 'హనుమాన్ అంశ్'తో విశాల్ చతుర్వేది ఉత్తమ తొలి భారతీయ ఫీచర్ చిత్ర దర్శకుడిగా నిలవగా.. 'ది గోల్డెన్ ఏజ్'తో బెరెంగర్ థౌయిన్ అంతర్జాతీయ విభాగంలో అవార్డు అందుకున్నారు. 'మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటన్ స్టోరీ' ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఎంపికైంది. 'రహ్మా' చిత్రానికి ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్ దక్కింది.
ప్రపంచ సినిమాకు గోవా గ్లోబల్ వేదిక..
'సరిహద్దులు లేని కథలు' (Stories Without Borders) ఇతివృత్తంతో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగిన ఈ వేడుకల్లో 86 దేశాలకు చెందిన 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలు, భారతీయ పనోరమాలో 18 భాషలకు చెందిన 76 సినిమాలు ప్రదర్శించారు. స్పెయిన్ గౌరవ దేశంగా, రష్యా భాగస్వామ్య దేశంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 100 మంది యువ ప్రతిభావంతులతో నిర్వహించిన 'క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో', 20వ వేవ్స్ ఫిల్మ్ బజార్ కూడా సినీ పరిశ్రమకు కొత్త అవకాశాలను అందించాయి.
గోవాను అంతర్జాతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. 'మేక్ ఇన్ గోవా.. మేక్ ఫర్ ది వరల్డ్' అంటూ తన విజన్‌ను ఆవిష్కరించారు. మూడు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో ముగింపు వేడుక మరింత రంగులమయంగా మారింది. మొత్తానికి అవార్డుల విజేతలతో పాటు కొత్త కథలు, కొత్త ప్రతిభకు వేదికగా నిలిచిన ఇఫీ 2026.. భారతీయ సినిమాకు ప్రపంచస్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
Hon’ble Chief Minister, @DrPramodPSawant attended and addressed the Closing Ceremony of the 57th International Film Festival of India, Goa at the Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium, St.Cruz. 🎬 AQUI, directed by Tiago Guedes, wins the prestigious Golden Peacock for Best Film at IFFI 2026. THE GOLDEN AGE’ wins Silver Peacock for Best Debut Feature Film Directed by Bérenger Thouin. 🎬 The River Train wins the Silver Peacock for Special Jury Award at IFFI 2026! 🎬 Maya O'Rourke wins the Silver Peacock for Best Actor (Female) for her remarkable performance in The Meltdown at IFFI 2026! 🎬🏆 Kantara: A Legend - Chapter 1 receives a Special Mention at IFFI 2026, celebrating its powerful storytelling and cinematic brilliance. 🎬 Rishab Shetty bags the Silver Peacock for Best Actor (Male) at #IFFI2026 for Kantara: A Legend Chapter 1! 🎉🎬 🎬Made In India: A Titan Story wins the Best Web Series OTT Award 2026 at the 57th International Film Festival of India Three-time National Film Award-winning Goan filmmaker Aditya Suhas Jambhale was felicitated by Goa Chief Minister Dr. Pramod Sawant at the star-studded Closing Ceremony of the 57th IFFI, recognising his remarkable creative journey and outstanding contribution to Indian cinema. #IFFI2026 #57IFFI #StoriesWithoutBorders @IFFIGoa
— DIP.GOA (@dip_goa) November 28, 2026
