టైటిల్: గరివిడి లక్ష్మి
డైరెక్షన్: గౌరి నాయుడు జమ్ము
కాస్ట్: ఆనంది, రాగ్ మయూర్, నరేశ్, శరణ్యప్రదీప్, రాశీ, అంకిత్ కొయ్య
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో దేవుడమ్మ (రాశీ) కూతురు లక్ష్మి. సన్యాసం తీసుకోవడంతో దేవుడమ్మ తన భర్తకు వేరే పెళ్లి చేసి పంపిస్తుంది. అప్పటినుంచి లక్ష్మిని దేవుడమ్మే చూసుకుంటుంది. కానీ తండ్రికి దూరమైన లక్ష్మి ఒంటరిగా బాధను అనుభవిస్తుంటుంది. అలా కొన్నేళ్లకు లక్ష్మికి పెళ్లి చేస్తుంది దేవుడమ్మ. కానీ ఆ పెళ్లి రెండు నెలలకే పెటాకులవుతుంది. అలా ఒంటరిగా ఉన్న లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ వస్తుంది.
బుర్ర కథ ద్వారా లక్ష్మి ప్రయాణంలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ క్రమంలో పరిచయమైన సత్తిబాబు (రామ్ మయూర్), రాంబాబు (నరేశ్) వల్ల లక్ష్మి జీవితం ఎటు వైపు వెళ్తుంది? అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి గరివిడి లక్ష్మి ఎందుకు వెళ్తుంది? గరివిడి లక్ష్మి జీవితాన్ని సినిమాగా తీయాలని, ఆమె గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ప్రయత్నం రాజేష్ (అంకిత్ కొయ్య) తన గమ్యాన్ని చేరుతాడా? అన్నదే మూవీ స్టోరీ.
