పంత్ అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయాడు.. అసలు ముచ్చట చెప్పిన అశ్విన్!  

పంత్ అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయాడు.. అసలు ముచ్చట చెప్పిన అశ్విన్!  

Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దూకుడుగా ఆడే ప్రయత్నంలో రిషభ్ పంత్ 23 పరుగులకే వికెట్ కోల్పోయాడు. కీలక సమయంలో ఇలా వికెట్ సమర్పించుకోవడంతో, అతడి ఆటతీరుపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ ఉన్నప్పటికీ, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే పంత్‌ను వెనక్కి లాగుతోందని, అందుకే అతడికి టెస్ట్ కెప్టెన్సీ అవకాశం రాలేదని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

కెప్టెన్సీ ఎందుకు మిస్ అయిందంటే: 

రిషభ్ పంత్ నైపుణ్యంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే, నిర్ణయాల్లో పరిణతి అవసరమని ఆర్. అశ్విన్ స్పష్టం చేశారు. ఆటలో సరైన నిర్ణయాలు తీసుకుంటే పంత్ వికెట్ కీపింగ్ భారం లేకుండానే టెస్టుల్లో నాలుగో స్థానంలో శాశ్వత బ్యాటర్‌గా నిలిచేవాడని తెలిపారు. నిర్ణయాలు తీసుకునే విధానంలో లోపాలు ఉండటం వల్లే భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని అతడు కోల్పోయాడని తేల్చి చెప్పారు.

వైట్-బాల్ క్రికెట్‌లోనూ అదే తడబాటు: 

* టెస్టులతో పాటు వన్డే, టీ20 ఫార్మాట్లలోనూ రిషభ్ పంత్ నిలకడలేమికి అతడి షాట్ సెలెక్షన్, నిర్ణయాలే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేశారు. భారీ రిస్క్‌తో కూడిన షాట్లు ఆడుతూ పంత్ తరచూ వికెట్లు పారేసుకుంటున్నాడని విశ్లేషించారు.

* క్రీజు వదిలి ముందుకొచ్చి ఫీల్డర్ల మీదుగా బంతిని కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఫీల్డర్లు ఎక్కడ ఉన్నారో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడని అశ్విన్ అన్నారు. దీంతో నేరుగా ఫీల్డర్ల చేతికే క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరుగుతున్నాడని చెప్పారు. ఆటతీరుపై సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ల సరసన నిలిచే సత్తా పంత్‌కు ఉందని, అలాంటి ప్రతిభ ఉండి కూడా ఇలా వికెట్లు కోల్పోవడం బాధగా అనిపిస్తోందని ఆర్. అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.