Ramayana Creates Box Office: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'రామాయణ'.. ధురంధర్ 2 రికార్డు బద్దలు.. దంగల్‌పై కన్నేసిన రణ్‌బీర్!

Ramayana Creates Box Office: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'రామాయణ'.. ధురంధర్ 2 రికార్డు బద్దలు.. దంగల్‌పై కన్నేసిన రణ్‌బీర్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,814 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' లైఫ్‌టైమ్ కలెక్షన్లను సైతం అధిగమించింది.

సినీ ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం భారత్‌లో ఇప్పటివరకు రూ.1,015.20 కోట్ల నెట్ వసూళ్లను, రూ.1,212.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లలోనూ రూ.602 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.1,814.55 కోట్లకు చేరాయి. ఈ క్రమంలో 'బాహుబలి 2' (రూ.1,788 కోట్లు), 'పుష్ప 2' (రూ.1,742 కోట్లు) రికార్డులను వెనక్కి నెట్టింది.

ఇప్పుడు అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' రికార్డులను కూడా అధిగిమించే దిశగా దూసుకెళ్తోంది. .2016లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2,070 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవిదూబే, లారా దత్తా, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుపమ్ ఖేర్ జటాయువు పాత్రకు తన గాత్రాన్ని అందించారు.

ALSO READ : Netflix Thriller: జైల్లో ఉంటూనే రూ.200 కోట్ల స్కామ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి సంచలన ట్రూ క్రైమ్ స్టోరీ!

మరోవైపు రెండో భాగంపై కూడా భారీ అంచనాలున్నాయి. సీతను రావణుడు అపహరించడంతో తొలి భాగం ముగియగా.. రెండో భాగంలో లంకా యుద్ధం, రామరావణుల పోరు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తొలుత 2027 దీపావళికి రావాల్సిన రెండో భాగాన్ని 2028 దీపావళికి వాయిదా వేశారు. అంతేకాదు, ప్రేక్షకుల స్పందనను బట్టి ఈ ఫ్రాంచైజీని మూడు భాగాలుగా విస్తరించే ఆలోచన కూడా ఉందని నిర్మాత నమిత్ మల్హోత్రా సంకేతాలిచ్చారు..