పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక సూచన..!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక సూచన..!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కూటమి ఎంపీలకు కీలక సూచన చేశారు సీఎం చంద్రబాబు. సోమవారం ( నవంబర్ 30 ) నుంచి పార్లమెంట్ లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ జరగనున్న క్రమంలో కూటమికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులంతా ఆదివారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. చారిత్రాత్మక బిల్లులపై చర్చ, ఆమోదం జరిగే సమయంలో కూటమి ఎంపీలు ఏ ఒక్కరు గైర్హాజరు కాకూడదని అన్నారు చంద్రబాబు.

టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టమని అన్నారు. ఇలాంటి చారిత్రక పరిణామంలో భాగస్వాములు కావడం ప్రజాప్రతినిధులకు దక్కిన గొప్ప అవకాశమని అన్నారు చంద్రబాబు. 

డీలిమిటేషన్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు చంద్రబాబు. ఈ కారణంగా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు చంద్రబాబు. దేశంలో రాజకీయ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని.. గతంలో ఈ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు సైతం మద్దతు ఇచ్చేందుకు రావడం మంచి పరిణామమని అన్నారు చంద్రబాబు.