ఏపీ DCM పవన్ తమిళనాడులో ఆలయాల పర్యటన.. తిరుపరంకుండ్రం ఎపిసోడ్తో ఉత్కంఠ !

ఏపీ DCM పవన్ తమిళనాడులో ఆలయాల పర్యటన.. తిరుపరంకుండ్రం ఎపిసోడ్తో ఉత్కంఠ !

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుత్తణి, తిరుమల పర్యటన ఖరారైంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది. నవంబర్ 30న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తమిళనాడులోని అరక్కోణం వద్ద ఉన్న ఐఎన్ఎస్ రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుత్తణికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంటకు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు పయనమవుతారు. సాయంత్రం 5 గంటల సమయంలో తిరుమలకు చేరుకోనున్నారు.

తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో పవన్ కళ్యాణ్ రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజు డిసెంబర్ 1న తెల్లవారుజామున శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉదయం 5.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

దర్శనం అనంతరం ఉదయం 6.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తిరుత్తణి ఆలయం, తిరుమలలో సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించనున్నారు.