రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అక్రమ అండాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ కి చెందిన CFO, అకౌంటెంట్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. CFO ఆశిష్ అగర్వాల్, అకౌంటెంట్ రేంటాల శేషగిరి రావులను నవంబర్ 28న రసూల్‌పురా మెట్రో స్టేషన్ దగ్గర అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.
నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని.. సంస్థ ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్ రికార్డులపై పోలీసుల ఆరా తీశామని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిదర్యాప్తు ముమ్మరం చేశామని..విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.
ALSO READ : కళకళలాడాల్సిన ఇంట్లో కన్నీటి రోదనలు.. ఎల్లంపేట్‌లో విషాదం
ఈ కేసులో ఇప్పటికే దుర్గా ప్రసాద్, అమిత్, ఎన్. నికాత్ పర్వీన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1145/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. హైదరాబాద్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో సద్గురు హెల్త్‌కేర్ పది కేంద్రాలను నిర్వహిస్తోంది. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నాలుగు లెవల్-II IVF క్లినిక్‌లు ఉన్నట్లు గుర్తించారు. మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ కేంద్రంగా అండదాతల సేకరణ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
