ఫుట్ పాత్ పై పడుకుంటే సుత్తెతో కొట్టి చంపారు ..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఫుట్ పాత్ పై పడుకుంటే సుత్తెతో కొట్టి చంపారు ..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  •     కుడివైపు నుదురు, కంటిపై     విచక్షణారహిత దాడి  
  •     అక్కడికక్కడే కన్నుమూత ..నిందితుల కోసం గాలింపు

ముషీరాబాద్,వెలుగు: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పాత్ పై పడుకున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు సుత్తెతో కొట్టి దారుణంగా చంపారు. ఒకవైపు నుదురు, కన్ను ఛిద్రమైపోయింది. రాంనగర్​ప్రాంతానికి చెందిన సుభాష్‌‌‌‌ (40) కూలి పని చేస్తూ ఫుట్ పాత్ లపై పడుకుంటాడు. బుధవారం తెల్లవారుజామున అశోక్ నగర్ వద్ద గల సంతోష్‌‌‌‌ కిరాణా షాపు సమీపంలో ఫుట్ పాత్ పై పడుకున్నాడు. 

తెల్లవారి అటువైపు వాకింగ్​కు వెళ్తున్న కొంతమందికి సుభాష్​రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిశీలించగా సుభాష్‌‌‌‌ ఎడమ వైపు నుదురు భాగం, కన్ను పూర్తిగా ఛిద్రమైపోయింది. 

కొద్దిదూరంలో రక్తంతో తడిసిన సుత్తె కనిపించింది. కేసు నమోదు చేసుకున్నామని, ఇంత దారుణంగా చంపిన వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ మధుబాబు తెలిపారు.