గోల్డ్ నేలచూపులు: వరుసగా 4వ రోజు ఎంత తగ్గిందంటే? తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే

గోల్డ్ నేలచూపులు: వరుసగా 4వ రోజు ఎంత తగ్గిందంటే? తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే

ఒకపక్క బంగారం వెండి దసరా షాపింగ్ పెరుగుతోంటే మరోపక్క వాటి ధరలు తగ్గటం మధ్యతరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తోంది. గడచిన 10 రోజులుగా బంగారం రేట్లు నేలచూపులు చూస్తుండటంతో షాపులకు క్యూకడుతున్నారు గోల్డ్ లవర్స్. ఈ క్రమంలో ఆభరణాలు కొనాలనుకుంటున్న వారు ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం. 

అక్టోబర్ 14న బంగారం రేట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.103 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 826గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 590గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 14, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.