ఏఐ, డేటా సెంటర్ పరికరాల తయారీకి.. జెబిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అదానీ జాయింట్ వెంచర్

ఏఐ, డేటా సెంటర్ పరికరాల తయారీకి.. జెబిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అదానీ జాయింట్ వెంచర్

న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అమెరికన్  కంపెనీ జెబిల్ కలిసి  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐ, డేటా సెంటర్ పరికరాల అసెంబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  తయారీని చేపట్టనున్నాయి.  ఇందుకోసం కోసం 50:50 జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం  కుదుర్చుకున్నాయి. 

ఈ ఒప్పందం ద్వారా ఏఐ ర్యాక్స్, సర్వర్లు, స్టోరేజ్, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్ పరికరాలతో పాటు పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు, లిక్విడ్-కూలింగ్ వ్యవస్థలను దేశీయంగా తయారు చేయనున్నారు. మల్టీ- గిగావాట్ సామర్థ్యంతో కూడిన కంప్యూటింగ్ వ్యవస్థలకు సేవలు అందించడమే ఈ జాయింట్ వెంచర్ లక్ష్యం. 

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐ మౌలిక సదుపాయాల డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చడంతో పాటు ఎగుమతులపై  కూడా దృష్టి పెట్టామని  జెబిల్ సీఈఓ మైక్ దస్తూర్ తెలిపారు. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ షేరు 2.47  శాతం పెరిగి రూ.2,694.00 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు