న్యూఢిల్లీ: లిక్విడిటీ పరంగా చూస్తే అమెరికా తర్వాత బహుశా ఇండియన్ స్టాక్ మార్కెటే అతిపెద్దదిగా నిలుస్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్స్టోన్ ప్రెసిడెంట్ జొనాథన్ గ్రే పేర్కొన్నారు. షేర్లను కొనడం, అమ్మడం (లిక్విడిటీ) ఇక్కడ చాలా ఈజీ అని అన్నారు. అంతేకాకుండా, షేర్లు అమ్మిన మరుసటి రోజే (టీ+1), అదే రోజే (టీ+0) ఖాతాల్లోకి డబ్బులు జమయ్యే వేగవంతమైన టెక్నాలజీ కూడా భారత మార్కెట్లపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెంచిందన్నారు.
గత 20 ఏళ్లలో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలకడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టడానికే ఇబ్బంది ఉండేదని, కానీ నేడు తమ ఆధ్వర్యంలోని పలు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకు భారత్కు తెస్తున్నామని తెలిపారు.
