నీట్ పేపర్ లీకేజీలకు చెక్ పెట్టాలంటే.. చివరి నిమిషంలోనే ప్రశ్నపత్రం తయారు చేయాలి: నందన్ నీలేకని

నీట్ పేపర్ లీకేజీలకు చెక్ పెట్టాలంటే.. చివరి నిమిషంలోనే ప్రశ్నపత్రం తయారు చేయాలి: నందన్ నీలేకని
  • ఒకే ప్రశ్నపత్రమే ఎందుకు?..నీట్ పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై నందన్ నీలేకని

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సూచించారు. ఒకే ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించడం వల్ల లీకైన పేపర్లను అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనికి బదులుగా భారీ క్వశ్చన్ బ్యాంక్ ఏర్పాటు చేసి, పరీక్షకు కొద్ది నిమిషాల ముందే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. ఒకే ప్రశ్నపత్రం ఎందుకు ఉండాలని నీలేకని ప్రశ్నించారు. 

లీకేజీలను అరికట్టాలంటే పరీక్షల రూపకల్పన, నిర్వహణ విధానాల్లో మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ) నిర్వహణను పెంచాలని నీలేకని సూచించారు. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 1.5 లక్షల కేంద్రాలు సరిపోవని, మరిన్ని కేంద్రాలు అవసరమని చెప్పారు. క్వశ్చన్ బ్యాంక్, చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల తయారీ, సీబీటీ విధానాలు పరీక్షల నిర్వహణలో కీలక మార్పులని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ కమిటీ కృషి చేస్తోందని, ప్రతిపాదనల అమలుపై ప్రధాని కూడా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.