రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 3,548 ఖాళీల భర్తీ కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 8న ప్రారంభమైంది. నవంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్.
మొత్తం ఖాళీలు: 3,548.
విభాగాల వారీగా ఖాళీలు: చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్‌వైజర్ 127, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 2750, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 300, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 371.
ఆర్ఆర్బీ సికింద్రాబాద్ పరిధిలో చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్‌వైజర్ 10, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 22, జూనియర్ ట్రైన్ మేనేజర్ 9, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 5, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 10.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 2027, జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 8.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలు రూ. 250 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rrbapply.gov.inను సందర్శించండి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1 అనేది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా తదుపరి దశ అయిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్– 2కి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-–1లో అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ –2 నిర్వహిస్తారు. ఫైనల్ మెరిట్, పోస్టుల ఎంపికలో ఈ పరీక్షలో సాధించిన మార్కులు కీలకం. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఇస్తారు.
కనీస అర్హత మార్కులు
అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీలు 30 శాతం, ఎస్సీలు 30 శాతం, ఎస్టీలు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
