నిధుల దుర్వినియోగం..  రామన్నపేట APM సస్పెండ్ 

నిధుల దుర్వినియోగం..  రామన్నపేట APM సస్పెండ్ 

ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో రామన్నపేట APM ఎస్.కె. జానీ మియాపై సస్పెన్షన్ వేటు పడింది. విచారణలో నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో అక్రమాలు గుర్తించడంతో కలెక్టర్ అనురాగ్ జయంతి జానీమియాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

DRDA లో అమలవుతున్న IMS SHG యూనిఫాం, Paddy Cleaner, MS-OB కార్యక్రమాలకు సంబంధించిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రికార్డుల నిర్వహణపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో బిల్లులు, వోచర్లు, క్యాష్‌బుక్, లెడ్జర్, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా ఫోన్‌పే లావాదేవీల ద్వారా జరిగిన చెల్లింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. విచారణ రిపోర్టును పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి.. బాధ్యుడిగా APM ఎస్.కె. జానీ మియాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.