ఘట్‌కేసర్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు

ఘట్‌కేసర్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు

మేడ్చల్ జిల్లా  ఘట్ కేసర్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  హైదరాబాద్, వరంగల్  హైవేపై కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. అన్నోజీగూడ డీమార్ట్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పైగా ఇవాళ  ఆదివారం  సెలవు దినం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది.  దాదాపు గంటనుంచి ఇదే పరిస్థితి . దీంతో ఇరువైపులా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.  ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

ALSO READ : నిధుల దుర్వినియోగం..  రామన్నపేట APM సస్పెండ్