మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ స్ట్రైట్ తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఆదివారం కూడా థియేటర్లలో ప్రేక్షకుల సందడి కొనసాగడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది.
ఈ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న 'ఆకాశంలో ఒక తార' చిత్రబృందం.. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసింది. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ సాత్విక వీరవల్లి, నిర్మాత స్వప్న దత్ సహా కీలక సభ్యులు మెగా హీరోల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్ సినిమా విజయంపై చిత్రబృందాన్ని అభినందించి, ప్రత్యేకంగా ప్రశంసించారు.. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో దుల్కర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తూ ఆకట్టుకుంటోంది. దుల్కర్ తన సహజమైన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సాత్విక వీరవల్లి కూడా తన పాత్రతో మెప్పించారు. గీతా ఆర్ట్స్, ప్రముఖ నిర్మాత స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ALSO READ : Sandeep Reddy Vanga: ప్రభాస్ 'స్పిరిట్'తర్వాత రణ్బీర్తోనే..
మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంటున్న దుల్కర్‌కు ఈ సినిమా మరో మంచి విజయాన్ని అందించింది. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు మరింత పెరిగి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి...
Aakaasamantha Vijayam...Aakasamantha Abhinandana ❤️⭐️ Mega Star #Chiranjeevi garu and Mega Power Star #RamCharan garu appreciated the team of #AakasamloOkaTara and congratulated them on delivering a Sky High Blockbuster 🚀 @KChiruTweets @AlwaysRamCharan ⭐️⭐️ #AOT In Cinemas Now. Book your Tickets 🎟 https://t.co/NFA7KBYXRE @dulQuer @pavansadineni @shrutihaasan @satveeravalli @iRuhaniSharma @GeethaArts @SwapnaCinema @DQsWayfarerFilm @Lightboxoffl @grajug @gvprakash @sunnygunnam @ramya_gunnam @sujithsarang #VasantJurru @shreelyricist @TSeries @tseriessouth
— Geetha Arts (@GeethaArts) November 29, 2026
