తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మీనాక్షి.. ప్రస్తుతం నాగచైతన్యకు జంటగా ‘వృషకర్మ’లో నటిస్తోంది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరో అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది. నితిన్ హీరోగా నటించబోయే చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించబోతున్నట్టు టాక్. ‘సామజవరగమన’ లాంటి వినోదాత్మక చిత్రంతో మెప్పించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులోనే హీరోయిన్‌గా మీనాక్షి నటించనుందట.
దర్శకుడి గత చిత్రం తరహాలో పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందా లేక మరేదైనా కొత్త జానర్ టచ్ చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘అలియాస్ రుక్మిణి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న నితిన్.. ఇది పూర్తవగానే కొత్త చిత్రంపై దృష్టి సారించనున్నాడు.
నితిన్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా?
ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నితిన్‌కు.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఈ హీరోకు ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ చాలా అవసరం. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల పల్స్ పట్టుకుని, వాళ్లను మెప్పించే కంటెంట్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడట.
ఈ క్రమంలో రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా నితిన్‌కు కీలక ప్రాజెక్ట్‌గా మారనుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లతో మెప్పించిన రామ్ అబ్బరాజు.. ఈసారి నితిన్ కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుందనే టాక్‌తో ఈ ప్రాజెక్ట్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ సినిమాతోనైనా నితిన్ బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవుతాడా? తన సక్సెస్ స్ట్రీక్‌ను తిరిగి స్టార్ట్ చేస్తాడా? అనేది చూడాలి.
నితిన్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు.. కమ్‌బ్యాక్‌పై భారీ ఆశలు!
వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమాలో నటిస్తున్నాడు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 4న థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కె వి ఆనంద్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.
మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనూ నితిన్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అంతేకాకుండా తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌లోనూ ఓ ప్రాజెక్ట్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి నితిన్ చేతిలో ఉన్న ఈ ప్రాజెక్టులు ఆయన కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. మరి కొత్త కథలు, డిఫరెంట్ కంటెంట్‌తో ఈ యంగ్ హీరో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా? వరుస హిట్లతో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
