Ram Charan : రామ్ చరణ్ సరసన సారా అర్జున్? సుకుమార్ సినిమాలో క్రేజీ కాంబినేషన్‌పై భారీ బజ్!

Ram Charan : రామ్ చరణ్ సరసన సారా అర్జున్? సుకుమార్ సినిమాలో క్రేజీ కాంబినేషన్‌పై భారీ బజ్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి మరో మోస్ట్ క్రేజీ కాంబో సిద్ధమవుతోంది. సంచలన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ 'RC17' తెరకెక్కనుంది.  గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం'బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుండటంతో ఈ మూవీపై టాలీవుడ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.

'పుష్ప 2'తో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సుకుమార్, ఈసారి చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  కథ, హీరోయిన్, చరణ్ లుక్.. ఇలా ప్రతి అంశంపై ఉత్కంఠ పెరుగుతోంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 25 లేదా 26 తేదీల్లో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వారంలోనే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 'పెద్ది' సినిమా షూటింగ్ తర్వాత చిన్నపాటి సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు.

►ALSO READ | Nithiin Meenakshi: నితిన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి.. క్రేజీ డైరెక్టర్తో కొత్త సినిమా!

మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మొదట కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. చరణ్ సరసన ఈ టాలెంటెడ్ బ్యూటీ అయితేనే పర్ఫెక్ట్ ఫిట్ అని సుకుమార్ భావిస్తున్నారట. 

సుకుమార్ చెప్పిన కథ, తన పాత్రలోని ఇంటెన్సిటీ నచ్చడంతో సారా కూడా క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తే టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్ క్రియేట్ అవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.. త్వరలోనే రానున్న అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.