మహమ్మద్ యూనస్కు..న్యూయార్క్లో నిరసన సెగ

మహమ్మద్ యూనస్కు..న్యూయార్క్లో నిరసన సెగ

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బంగ్లాదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు మహమ్మద్ యూనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఆయనను ప్రవాస బంగ్లాదేశీయులు అడ్డుకున్నారు. ‘‘నువ్వొక టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశావు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని, తన పాలనలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యుడని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12న యూనస్ దోహా నుంచి ఖతార్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ విమానంలో న్యూయార్క్ చేరుకున్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులోని టెర్మినల్ 8 వద్దకు చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి నిలదీశారని ఢాకాకు చెందిన ‘డైలీ సన్’పత్రిక వెల్లడించింది.