ఇంజినీరింగ్ పూర్తి చేశారా..? HAL లో ఉద్యోగాల జాతర: ఇంటర్వ్యూతోనే ప్రభుత్వ ఉద్యోగం..

ఇంజినీరింగ్ పూర్తి చేశారా..? HAL లో ఉద్యోగాల జాతర: ఇంటర్వ్యూతోనే  ప్రభుత్వ ఉద్యోగం..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 7న ప్రారంభమైంది. అక్టోబర్ 17 వరకు అప్లై చేయవచ్చు.
 
పోస్టు పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్.

మొత్తం ఖాళీలు: 150.

విభాగాల వారీగా ఖాళీలు: ఏరోనాటికల్ 2. కెమికల్ 2, సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 25, ఎల క్ట్రానిక్స్ 21, మెకానికల్ 78, మెటలర్జీ 3, ప్రొడక్షన్ 6.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/టెక్నాలజీలో రెగ్యులర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో అన్ రిజర్వ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 10+2+4 విధానంలో (ఇంజినీరింగ్ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా చేరినవారు 10+3+3 విధానంలో) డిగ్రీని అభ్యసించి ఉండాలి.

వయసు: 2026, అక్టోబర్ 17 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితి లో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 7.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఇతరులకు ఫీజు ఉండదు.

లాస్ట్ డేట్ : అక్టోబర్ 17.

ఇంటర్వ్యూ: 2026, నవంబర్.

సెలెక్షన్ ప్రాసెస్
షార్ట్ లిస్టింగ్: అర్హత పరీక్షలో (క్వాలిఫైయింగ్ కోర్స్/ఎగ్జామినేషన్) సాధించిన సగటు మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి డిసిప్లైన్, కేటగిరీ వారీగా ఖాళీల సంఖ్యకు గరిష్టంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ: షార్ట్స్ట్ అయిన అభ్యర్థుల సామర్ధ్యా న్ని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అంచనా వేస్తుంది. తుది ఎంపిక: కేవలం ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే జరుగుతుంది.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  www.hal-india. co.inను సందర్శించండి.