- ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సెస్ కార్యదర్శిగా కొనసాగింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలకమైన ఎక్సైజ్, వాణిజ్య పన్నుల విభాగం కార్యదర్శిగా ఉన్న 2002 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్ రావును రాష్ట్ర ప్రభుత్వం రీ–అపాయింట్ చేసింది. ఆయన 2027 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, రిటైర్మెంట్ అనంతరం కూడా అదే పోస్టులో కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రీ–అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను త్వరలోనే విడిగా జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సాధారణంగా పదవీ విరమణ తేదీ సమీపించిన తర్వాతే పునర్నియామక ఉత్తర్వులు వెలువడుతుంటాయి. కానీ, దాదాపు 3 నెలల ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు పాలనా వ్యవహారాల్లో, నిర్ణయాల అమలులో వేగంగా పనిచేసే అధికారిగా రఘునందన్ రావుకు పేరుంది.
