ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక ‘దీక్షా దివస్’ : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌

ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక ‘దీక్షా దివస్’ : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌
  • అలుగునూరులో కనీవినీ ఎరుగని రీతిలో స్ఫూర్తి సభకు ఏర్పాట్లు 
  •     ఎమ్మెల్యే గంగుల కమలాకర్​
  •     పార్టీ మీటింగ్​ కాదు.. ఆత్మగౌరవ సభ : మాజీ ఎంపీ వినోద్​

తిమ్మాపూర్, వెలుగు : తెలంగాణ సాధనోద్యమంలో నవంబర్‌‌‌‌‌‌‌‌ 29కి ప్రత్యేకస్థానం ఉందని, ఆత్మగౌరవ పోరాటానికి దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తి సభను విజయవంతం చేసేందుకు కనీవినీ ఎరుగని రీతిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. శనివారం సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి ఉద్యమ నాయకుడు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేపట్టిన 2009 నవంబర్‌‌‌‌‌‌‌‌ 29న ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందని గుర్తుచేశారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అలుగునూరు వద్ద అరెస్టు చేయడంతో తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఆ రోజు నుంచి అలుగునూరు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా నిలిచిపోయిందని తెలిపారు. ఈ సభకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ హాజరుకానున్నారని వెల్లడించారు.  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సభ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే రసమయి, మాజీ ఎంపీ బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగరశాఖా అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.