కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీలోని డంపింగ్ యార్డులో శనివారం రాత్రి మళ్లీ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆటోనగర్, కోతిరాంపూర్, పోచమ్మవాడ, అల్కపురి కాలనీ, రామగుండం బైపాస్ రోడ్డు నుంచి కమాన్ వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దట్టమైన పొగతో డంపింగ్ యార్డు పరిసర కాలనీల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బైపాస్ రోడ్డులో మంచుతోపాటు పూర్తిగా పొగ కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బయోమైనింగ్ ద్వారా డంపింగ్ యార్డును క్లియర్ చేయకుండా చెత్త తగ్గించేందుకు ఇలా తరచూ మున్సిపల్ సిబ్బందే మంటలు అంటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
