ట్రంప్ పార్టీకి.. ఎలాన్ మస్క్ రూ.3 వేల కోట్ల విరాళం..న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు

ట్రంప్ పార్టీకి.. ఎలాన్ మస్క్ రూ.3 వేల కోట్ల విరాళం..న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు
  • యూఎస్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో భారీగా నిధుల ఖర్చు

న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని గెలిపించడం కోసం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ భారీగా నిధులు సమకూర్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ఎన్నికల్లో ఆయన మొత్తం 366 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,000 కోట్లకు పైగా) ఖర్చు చేశారు. ఇందులో జులై నుంచి ఇప్పటివరకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే 276 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఈ వివరాలను మస్క్ రాజకీయ వ్యవహారాల ప్రతినిధి ఆండ్రూ రోమియో కూడా ధ్రువీకరించారు. దీనితో ఈ ఏడాది ఎన్నికల్లో అత్యధిక విరాళం అందించిన ఏకైక అతిపెద్ద డోనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మస్క్ నిలిచారు. నవంబర్ 3న అమెరికాలో ఓటింగ్ జరగనుంది. డెమోక్రాట్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న తరుణంలో మస్క్ ఈ విరాళాలు అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

3 నెలల్లోనే 276 మిలియన్ డాలర్లు

రిపబ్లికన్ పార్టీ సెనేట్ అభ్యర్థులకు మద్దతుగా పనిచేసే  ‘సెనేట్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఫండ్’కు మస్క్ 158 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. తన సొంత గ్రూప్​ నుంచి ‘అమెరికా పీఏసీ’కి మరో  76 మిలియన్లు,  కాంగ్రెషనల్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఫండ్ 20 మిలియన్లు, లోన్ స్టార్ లిబర్టీ ప్యాక్ 10 మిలియన్లు, రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ 10 మిలియన్లు, రిపబ్లికన్ అటార్నీ జనరల్స్ అసోసియేషన్​కు 2 మిలియన్లు ఇచ్చారు. విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరంలేని కొన్ని సంస్థలకు కూడా  మస్క్​ 90 మిలియన్ డాలర్లు వెచ్చించారు.