లడఖ్ ఎప్పటికీ మాదే..చైనాకు తేల్చి చెప్పిన భారత్

లడఖ్ ఎప్పటికీ మాదే..చైనాకు తేల్చి చెప్పిన భారత్
  • లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 ప్రాంతాలకు పేర్లు పెట్టడంపై డ్రాగన్ కంట్రీ అభ్యంతరం
  • ఎన్ని అభ్యంతరాలు పెట్టినా సత్యం మారదని భారత్ కౌంటర్
  • సరిహద్దు స్పష్టత కోసమే లడఖ్ ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు వెల్లడి

న్యూఢిల్లీ: లడఖ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ స్పష్టం చేసింది. చైనా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఈ చారిత్రక వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని తేల్చిచెప్పింది. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు చైనాకు లేదని పేర్కొంది. ఈ నెల 2న కేంద్ర ప్రభుత్వం లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక లక్షణాలను అధికారికంగా గుర్తించింది. వాటికి ప్రామాణిక పేర్లను కేటాయించి ‘సర్వే ఆఫ్ ఇండియా’ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచింది. 

ఇందులో గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి కీలక సరిహద్దు ఘర్షణ ప్రాంతాలతో పాటు అలిషా గిరి, జోరావర్ పీక్ వంటి ఎత్తయిన శిఖరాలు, పాంపిక్ గ్లేసియర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అధికారిక కార్టోగ్రఫీని క్రమబద్ధీకరించడం, మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సులభతరం చేయడం, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలపై ప్రజలకు కచ్చితమైన సమాచారం, అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

అయితే, భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ ఏకపక్షంగా పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. పశ్చిమ సరిహద్దు రంగానికి చెందిన ఆ ప్రాంతాలు తమవేనని పేర్కొన్నారు. 

తిప్పికొట్టిన భారత్

చైనా చేస్తున్న ఈ నిరాధార ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తిప్పికొట్టింది. లడఖ్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని, అంతర్భాగమైన ప్రాంతమని స్పష్టం చేసింది. చైనా ఎన్నిసార్లు ఖండించినా, ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈ చారిత్రక సత్యాన్ని ఎవరూ మార్చలేరని తేల్చిచెప్పింది. 2020లో గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుదీర్ఘ చర్చలు, రెండేళ్ల ప్రతిష్టంభన అనంతరం ఇరు దేశాలు కొన్ని ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ చేపట్టాయి. ఇప్పుడు మరోసారి లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వ్యూహాత్మక ప్రదేశాలకు పేర్లు పెట్టిన నేపథ్యంలో, 3,500 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఆధిపత్యం కోసం మాటల యుద్ధం మొదలైంది.