ప్రధాని మోదీపై వ్యాఖ్యల కేసులో.. రాహుల్కు సుప్రీంలో ఊరట

ప్రధాని మోదీపై వ్యాఖ్యల కేసులో.. రాహుల్కు సుప్రీంలో ఊరట
  • మహారాష్ట్ర సర్కారు, ఫిర్యాదుదారుడికి నోటీసులు  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలోని ట్రయల్ కోర్టులో ఆయనపై కొనసాగుతున్న విచారణ ప్రక్రియపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఫిర్యాదుదారు ఎం.హెచ్. శ్రీశ్రీమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అప్పటివరకు ట్రయల్ కోర్టులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని స్పష్టం చేసింది. 

2018, సెప్టెంబరు 20న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ బీజేపీ నేత ఎం.హెచ్. శ్రీశ్రీమల్ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రధానితో పాటు బీజేపీ సభ్యులను, భారతీయులను విమర్శించేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో గిర్గావ్ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతంలో బాంబే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.