శుభ్ మన్ గిల్‌‌‌‌ రికార్డు .. ఐదోసారి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డు

శుభ్ మన్  గిల్‌‌‌‌ రికార్డు .. ఐదోసారి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డు

దుబాయ్‌‌‌‌: టీమిండియా కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ రికార్డు స్థాయిలో ఐదోసారి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డును గెలుచుకున్నాడు. సెప్టెంబర్‌‌‌‌ నెలలో వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన వన్డే సిరీస్‌‌‌‌లో డబుల్‌‌‌‌ సెంచరీతో చెలరేగిన గిల్‌‌‌‌ మొత్తం 333 రన్స్‌‌‌‌ చేశాడు. గతంలో 2023లో జనవరి, సెప్టెంబర్‌‌‌‌లో, 2025లో ఫిబ్రవరి, జులైలో ఈ అవార్డు సాధించాడు. దాంతో మెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఐదుసార్లు అవార్డు గెలిచిన తొలి క్రికెటర్‌‌‌‌గా నిలిచాడు.

ఈ క్రమంలో వెస్టిండీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ హేలీ మాథ్యూస్‌‌‌‌ (5) రికార్డును సమం చేశాడు. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో షెఫాలీ వర్మకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డు లభించింది. విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ 184.61 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో ఏకంగా 360 రన్స్‌‌‌‌ చేసింది. అలాగే 6 వికెట్లు పడగొట్టింది. ఒకే నెలలో మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ అవార్డులను ఒకే దేశానికి చెందిన ప్లేయర్లు దక్కించుకోవడం ఇది ఐదోసారి కాగా, టీమిండియా ప్లేయర్లు ఈ ఘనత సాధించడం మూడోసారి. జూన్‌‌‌‌ 2024లో బుమ్రా, స్మృతి మంధాన.. 2025లో అభిషేక్‌‌‌‌ శర్మ, స్మృతి మంధాన ఈ పురస్కారాలు అందుకున్నారు.